అల్-ముఖ్తసర్
وَنَادَىٰٓ أَصْحَـٰبُ ٱلْأَعْرَافِ رِجَالًا يَعْرِفُونَهُم بِسِيمَىٰهُمْ قَالُوا۟ مَآ أَغْنَىٰ عَنكُمْ جَمْعُكُمْ وَمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ ﴿٤٨﴾
ఆరాఫ్ వారు అవిశ్వాసపరుల్లోంచి నరకవాసులైన వారిలోంచి చాలా మందిని వారి చిహ్నాలైన వారి నల్ల ముఖముల ద్వారా,వారి నీలి కళ్ళ ద్వారా గుర్తు పడతారు. వారిని ఉద్దేశించి ఇలా అంటారు : మీ ధనము,జనము ఎక్కువవ్వటం మీకు ఏ మాత్రం ప్రయోజనం చేయ లేదు. గర్వం అహంకారం వలన మీరు సత్యం నుండి విముఖత చూపటం మీకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు.