×

الأنعام

ఆయత్ 57

అల్-ముఖ్తసర్

قُلْ إِنِّى عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَكَذَّبْتُم بِهِۦ ۚ مَا عِندِى مَا تَسْتَعْجِلُونَ بِهِۦٓ ۚ إِنِ ٱلْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ ٱلْحَقَّ ۖ وَهُوَ خَيْرُ ٱلْفَـٰصِلِينَ ﴿٥٧﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నిశ్చయంగా నేను ఎటువంటి మనోవాంచనకు లోను కాకుండా నా ప్రభువు తరపునుంచి స్పష్టమైన ఆధారంపై ఉన్నాను.మీరు ఆ ఆధారాన్నే తిరస్కరించారు.ఏ శిక్ష గురించైతే మీరు తొందరపడుతున్నారో అదీ,మీరు కోరే అద్భుత సూచన నా వద్ద లేవు.అవి అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నవి.సంక్షిప్తముగా చెప్పేదేమిటంటే మీరు కోరతున్న న్యాయాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే ఉన్నది.ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు,దానిపరంగా తీర్పునిస్తాడు.అసత్యం పలికే వాడిని సత్యం పలికే వాడిని వేరు చేసిన వాడు అతడు పరిశుద్ధుడు,ఉత్తముడు.