×

الأنعام

ఆయత్ 144

అల్-ముఖ్తసర్

وَمِنَ ٱلْإِبِلِ ٱثْنَيْنِ وَمِنَ ٱلْبَقَرِ ٱثْنَيْنِ ۗ قُلْ ءَآلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ ٱلْأُنثَيَيْنِ أَمَّا ٱشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ ٱلْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَآءَ إِذْ وَصَّىٰكُمُ ٱللَّهُ بِهَـٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا لِّيُضِلَّ ٱلنَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿١٤٤﴾

ఎనిమిది రకాల్లో మిగతావి అవి ఒంటెలలోంచి రెండు,ఆవుల్లోంచి రెండు.ఓ ప్రవక్తా మీరు ముష్రికులతో ఇలా తెలపండి : వాటిలోంచి మగ జంతువు కావటం వలన లేదా ఆడ జంతువు కావటం వలన లేదా తల్లి గర్భంలో ఉన్న పిండం కావటం వలన నిషేంచుకోబడినవి అల్లాహ్ నిషేదించాడా?లేదా ఓ ముష్రికులారా మీ ఆలోచనాపరంగా ఈ పశువుల నుండి మీరు ఏవైతే నిషేదించుకున్నారో ఆ నిషేదం గురించి అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరు అక్కడ ఉన్నారా?. ఎటువంటి ఆధారము,జ్ఞానము లేకుండా ప్రజలను సన్మార్గము నుండి మరల్చటం కొరకు అల్లాహ్ పై అబద్దమును అంటగట్టి ఆయన నిషేధించని వాటిని ఆయన నిషేధించినట్లు ఆయన వైపునకు మరల్చే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు,పాపాత్ముడు ఇంకొకడుండడు. నిశ్చయంగా అల్లాహ్ పై అబద్దమును అంటగట్టటం వలన దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గము పొందే సౌభాగ్యమును కలిగించడు.