×

الأنعام

ఆయత్ 143

అల్-ముఖ్తసర్

ثَمَـٰنِيَةَ أَزْوَٰجٍ ۖ مِّنَ ٱلضَّأْنِ ٱثْنَيْنِ وَمِنَ ٱلْمَعْزِ ٱثْنَيْنِ ۗ قُلْ ءَآلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ ٱلْأُنثَيَيْنِ أَمَّا ٱشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ ٱلْأُنثَيَيْنِ ۖ نَبِّـُٔونِى بِعِلْمٍ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿١٤٣﴾

మీ కొరకు ఆయన ఎనిమిది రకాల జంతువులను సృష్టించాడు. గొర్రెల్లోంచి రెండు ఆడ,మగ మరియు మేకల్లోంచి రెండు ఆడ,మగ. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఏమిటి అల్లాహ్ ఆ రెండిటిలోంచి మగవి కావటం వలన రెండు మగ జంతువులను నిషేదించాడా ? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో మీరు అనండి : అలాగైతే మీరు ఆడ జంతువులను ఎందుకు నిషేదించుకున్నారు?. లేదా ఆయన ఆడ జంతువులు కావటం వలన రెండు ఆడ జంతువులను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు రెండు మగ జంతువులను నిషేదించుకుంటున్నారు? లేదా అతడు గర్భంలో ఉన్న పిండంకావటం వలన రెండు ఆడ జంతువుల గర్భంలో ఉన్న పిండాలను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు తల్లి గర్భంలో ఉన్న పిండముల మధ్య వాటి మగ జంతువులను ఒక సారి నిషేదించుకుని,వాటి ఆడ జంతువులను ఒక సారి నిషేదించుకుని తేడా చూపుతున్నారు. ఓ ముష్రికులారా నాకు సమాధానమివ్వండి మీరు దేనిని ఆధారంగా తీసుకున్నారో అది సత్య జ్ఞానములోంచిదా ఈ నిషేదము అల్లాహ్ తరపు నుంచి అన్న దానిలో మీరు చేస్తున్న వాదన విషయంలో మీరు సత్యవంతులే నైతే (నాకు సమాధానమివ్వండి).