అల్-ముఖ్తసర్
فَبِمَا نَقْضِهِم مِّيثَـٰقَهُمْ وَكُفْرِهِم بِـَٔايَـٰتِ ٱللَّهِ وَقَتْلِهِمُ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌۢ ۚ بَلْ طَبَعَ ٱللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ﴿١٥٥﴾
అయితే వారు తమపై ఉన్న ఖచ్చితమైన ప్రమాణమును భంగపరచటం వలన మరియు అల్లాహ్ ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన మరియు దైవ ప్రవక్తలను హతమార్చటంపై వారి దుస్సాహసం వలన మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మా హృదయములపై మూతలు ఉన్నాయి మీరు చెప్పేది అవి గుర్తుపెట్టుకోవు అని వారి పలకటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి దూరం చేశాము. వారు చెబుతున్నట్లు విషయం కాదు. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన వారి హృదయములపై సీలు వేశాడు వాటి వరకు మేలు చేరదు. వారు తమకు ప్రయోజనం కలిగించని కొద్దిపాటి విశ్వాసమును మాత్రమే కలిగి ఉన్నారు.