×

النساء

ఆయత్ 154

అల్-ముఖ్తసర్

وَرَفَعْنَا فَوْقَهُمُ ٱلطُّورَ بِمِيثَـٰقِهِمْ وَقُلْنَا لَهُمُ ٱدْخُلُوا۟ ٱلْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا۟ فِى ٱلسَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَـٰقًا غَلِيظًا ﴿١٥٤﴾

మరియు వారితో తీసుకోబడిన దృఢ ప్రమాణము వలన అందులో ఉన్న వాటిని వారు ఆచరించటానికి భయపెట్టటానికి మేము వారిపై పర్వతమును తీసుకుని వచ్చి నిలబెట్టాము. మరియు దాన్ని వారిపై నిలబెట్టిన తరువాత మేము వారితో ఇలా పలికాము : మీరు శిరసాలను వంచి సాష్టాంగపడుతూ బైతుల్ మఖ్దిస్ ద్వారములో ప్రవేశించండి. అప్పుడు వారు తమ పిరుదులపై ప్రాకుతూ ప్రవేశించారు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు శనివార దినమున వేటాడే విషయంలో ముందడుగు వేసి మితిమీరకండి. కాని వారు మితిమీరి వేటాడటం మత్రం వారితో జరిగింది. మరియు మేము దీనిపై వారితో దృఢమైన ప్రమాణమును తీసుకున్నాము. కాని వారితో తీసుకోబడిన ప్రమాణమును వారు భంగపరిచారు.