×

النساء

ఆయత్ 153

అల్-ముఖ్తసర్

يَسْـَٔلُكَ أَهْلُ ٱلْكِتَـٰبِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَـٰبًا مِّنَ ٱلسَّمَآءِ ۚ فَقَدْ سَأَلُوا۟ مُوسَىٰٓ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوٓا۟ أَرِنَا ٱللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ ٱلصَّـٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ ٱتَّخَذُوا۟ ٱلْعِجْلَ مِنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَـٰتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَءَاتَيْنَا مُوسَىٰ سُلْطَـٰنًا مُّبِينًا ﴿١٥٣﴾

ఓ ప్రవక్తా యూదులు మీ నిజాయితీకి సూచన అవటమునకు మూసా విషయంలో జరిగినట్లు ఆకాశము నుండి ఒక గ్రంధం ఒకేసారి వారిపై అవతరింపబడాలని మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే మీరు వారి ఈ మాటను పెద్దదిగా భావించకండి. వారి పూర్వికులు వీరందరు అడిగిన దానికంటే పెద్దదే మూసాను అడిగారు. అదేమిటంటే వారు అల్లాహ్ ను తమకు కళ్ళారా చూపించమని ఆయనను అడిగారు. అప్పుడు వారు పాల్పడిన దానికి శిక్షగా స్పృహ కోల్పో బడ్డారు. ఆ తరువాత అల్లాహ్ వారి ని జీవింపజేశాడు. అప్పుడు వారు అల్లాహ్ ఏకత్వమును సూచించే మరియు దైవత్వము,ఆరాధన ఆయన ఒక్కడికే అని సూచించే స్పష్టమైన సూచనలు వారి వద్దకు వచ్చిన తరువాత అల్లాహ్ ను వదిలి ఆవు దూడను ఆరాధించారు. ఆ తరువాత మేము వారిని మన్నించాము. మరియు మేము మూసాకు ఆయన జాతి వారికి విరుద్ధంగా స్పష్టమైన వాదనను ప్రసాదించాము.