×

البقرة

ఆయత్ 285

అల్-ముఖ్తసర్

ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِۦ وَٱلْمُؤْمِنُونَ ۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَـٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِۦ ۚ وَقَالُوا۟ سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ ٱلْمَصِيرُ ﴿٢٨٥﴾

తన ప్రభువు ద్వారా తనపై అవతరించిన ప్రతీదానినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం విశ్వసించారు. అలాగే విశ్వాసులు కూడా. వారందరూ అల్లాహ్ ను, ఆయన దైవదూతలందరినీ, వివిధ సందేశహరులపై ఆయన అవతరింపజేసిన దివ్యగ్రంథాలన్నింటినీ మరియు ఆయన పంపిన సందేశహరులందరినీ విశ్వసించారు. వారు ఆ సందేశహరుల మధ్య ఎలాంటి భేదం చూపకుండా, వారందరినీ నమ్ముతారు. వారిలా అంటారు : మీ ఆజ్ఞలు మరియు నిషేధాల గురించి మేము విన్నాము. మీ ఆజ్ఞలను పాటిస్తూ మరియు మీ నిషేధాలను వదిలివేయడం ద్వారా మేము మీకు విధేయులం అవుతాము. ప్రభువా! మమ్మల్ని క్షమించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము, ఎందుకంటే మాకు సంబంధించిన విషయాలన్నింటిలో మేము మీ వద్దకే ఒంటరిగా మరలి వస్తాము.