అల్-ముఖ్తసర్
لَا يُكَلِّفُ ٱللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا ٱكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَآ إِن نَّسِينَآ أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَآ إِصْرًا كَمَا حَمَلْتَهُۥ عَلَى ٱلَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِۦ ۖ وَٱعْفُ عَنَّا وَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَآ ۚ أَنتَ مَوْلَىٰنَا فَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ ﴿٢٨٦﴾
అల్లాహ్ ఒక వ్యక్తిపై అతడు భరించ గలిగినంత భారాన్ని మాత్రమే వేస్తాడు. అల్లాహ్ యొక్క ధర్మం సౌలభ్యం మీదే ఆధారపడి ఉంటుంది తప్ప కష్టతరం, దుర్లభం మీద కాదు. ఒక వేళ ఎవరైనా మంచి చేస్తే, బదులుగా అతడు దాని మొత్తం ప్రతిఫలాన్ని ఏమీ తగ్గకుండా పొందుతాడు. అలాగే ఒక వేళ ఎవరైనా చెడు చేస్తే, అతను చేసిన పాపానికి సరిసమానమైన శిక్ష మాత్రమే అతడి పై పడుతుంది మరియు అతని శిక్షను వేరెవ్వరూ మోయరు. సందేశహరులు మరియు విశ్వాసులు ఇలా వేడుకున్నారు, 'ఓ ప్రభూ! ఒక వేళ మేము ఏదైనా మరిచిపోయినా, ఏదైనా చేస్తున్నప్పుడు తప్పు చేసినా, అనాలోచితంగా ఏదైనా నోరు జారినా మమ్మల్ని శిక్షించకు. ఓ ప్రభూ! మా శక్తికి మించిన భారాన్ని మరియు ఆజ్ఞలను మాపై మోపకు - వేటినైతే మాకు పూర్వం ప్రజలకు నీవు ఇచ్చినావో మరియు ఆ ఆజ్ఞలను పాటించడంలో తాము చేసిన తప్పులకు బదులుగా వారు శిక్షించబడ్డారో (యోదుల వలే). మా కొరకు కష్టతరమైన మరియు మేము పూర్తి చేయలేనటువంటి ఆజ్ఞలను,నిషేదాలను మాపై మోపకు నీవు కరుణతో మా పాపాలను పట్టించుకోకు, మమ్మల్ని క్షమించు మరియు మాపై దయ చూపు. నీవే మా సంరక్షకుడివి మరియు సహాయకుడివి, కాబట్టి అవిశ్వాసులపై మాకు విజయం ప్రసాదించు.