×

البقرة

ఆయత్ 284

అల్-ముఖ్తసర్

لِّلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَإِن تُبْدُوا۟ مَا فِىٓ أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ ٱللَّهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿٢٨٤﴾

ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందినది. ఆయన సృష్టి అంతటినీ సృష్టించాడు. తన ఆధీనములో ఉంచుకున్నాడు మరియు నియంత్రిస్తున్నాడు. మీరు మీ హృదయంలో ఉన్నదాన్ని బహిరంగ పరిచినా లేదా దాచినా, అల్లాహ్ కు దాని గురించి తెలుసు మరియు ఆయన దాని లెక్క మీ నుండి తీసుకుంటాడు. తన దయ మరియు కరుణ కారణంగా ఆయన తాను తలుచుకున్న వారిని క్షమిస్తాడు. తన వివేకం మరియు న్యాయంతో ఆయన తాను తలుచుకున్న వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.