×

البقرة

ఆయత్ 253

అల్-ముఖ్తసర్

تِلْكَ ٱلرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ ٱللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَـٰتٍ ۚ وَءَاتَيْنَا عِيسَى ٱبْنَ مَرْيَمَ ٱلْبَيِّنَـٰتِ وَأَيَّدْنَـٰهُ بِرُوحِ ٱلْقُدُسِ ۗ وَلَوْ شَآءَ ٱللَّهُ مَا ٱقْتَتَلَ ٱلَّذِينَ مِنۢ بَعْدِهِم مِّنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَـٰتُ وَلَـٰكِنِ ٱخْتَلَفُوا۟ فَمِنْهُم مَّنْ ءَامَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَآءَ ٱللَّهُ مَا ٱقْتَتَلُوا۟ وَلَـٰكِنَّ ٱللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ ﴿٢٥٣﴾

మేము నీకు ఈ దైవసందేశహరుల గురించి ప్రస్తావించాము۔ దైవవాణి విషయంలో,అనుచరుల విషయంలో,స్థానముల విషయంలో వారిలో కొందరిని మేము కొందరిపై ప్రాధాన్యతను ప్రసాదించాము. వారిలో నుంచి అల్లాహ్ సంభాషించిన మూసా అలైహిస్సలాం లాంటి వారు ఉన్నారు. మరియు వారిలో నుంచి ఆయన ఉన్నత స్థానాలు ప్రసాదించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. ఆయన ప్రజలందరి వైపు పంపించబడ్డ ప్రవక్త మరియు ఆయనతో దైవదౌత్యం పరిసమాప్తి చేయబడింది. మరియు ఆయన సమాజమునకు ఇతర సమాజములపై ఘనత ప్రసాదించబడినది. మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంనకు ఆయన దైవదౌత్యముపై సూచించే స్పష్టమైన మహిమలను ప్రసాదించాము. ఉదాహరణకు : పుట్టుగుడ్డినీ,కుష్టు రోగిని నయం చేయటం. మరియు మేము ఆయనకు జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ ఆదేశమును చేసే బలము ఆయనకు కలగటం కొరకు మద్దతునిచ్చాము. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే ప్రవక్తల తరువాత వచ్చినవారు తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కలహించుకునేవారు కాదు. కాని వారు విబేధించుకుని విడిపోయారు. వారిలో నుండి అల్లాహ్ ను విశ్వసించిన వారు ఉన్నారు. మరియు వారిలో నుండి ఆయనను తిరస్కరించినవారు ఉన్నారు. ఒక వేళ అల్లాహ్ వారు కలహించుకోకూడదని తలచుకుంటే వారు కలహించుకునేవారు కాదు. కాని అల్లాహ్ తాను తలచుకున్న దాన్ని చేస్తాడు. కాబట్టి ఆయన తాను తలచుకున్న వారికి తన కారుణ్యము,అనుగ్రహము ద్వారా విశ్వాసం వైపునకు మార్గదర్శకం చేస్తాడు. మరియు తాను తలచుకున్న వారికి తన న్యాయము,విజ్ఞత ద్వారా అపమార్గమునకు లోను చేస్తాడు.