అల్-ముఖ్తసర్
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَنفِقُوا۟ مِمَّا رَزَقْنَـٰكُم مِّن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَـٰعَةٌ ۗ وَٱلْكَـٰفِرُونَ هُمُ ٱلظَّـٰلِمُونَ ﴿٢٥٤﴾
అల్లాహ్ ను విశ్వసిస్తూ ఆయన ప్రవక్తలను అనుసరించే ప్రజలారా! పునరుత్థాన దినం రాక ముందే, అల్లాహ్ మీకు ప్రసాదించిన వివిధ రకాల ఆమోదయోగ్యమైన సంపదల నుండి ఖర్చు చేయండి. ఆ దినాన, ఒక వ్యక్తి తనకు ఉపయోగపడే వస్తువులు కొనుక్కునేందుకు ఎలాంటి అమ్మకమూ ఉండదు, కష్టకాలంలో పనికి వచ్చే ఏ స్నేహమూ మిగిలి ఉండదు, అల్లాహ్ అనుమతి లేకుండా అతడిని ఎలాంటి హాని నుండైనా కాపాడే లేదా అతడికి ఎలాంటి ప్రయోజనాన్నైనా చేకూర్చే మధ్యవర్తిత్వమూ ఉండదు. నిజానికి అల్లాహ్ పై తమ విశ్వాసాన్ని దాయడం వలన, అవిశ్వాసులు దౌర్జన్యపరులవుతారు.