అల్-ముఖ్తసర్
تِلْكَ ءَايَـٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ ٱلْمُرْسَلِينَ ﴿٢٥٢﴾
ఇవి స్పష్టమైన, దృఢమైన అల్లాహ్ చిహ్నాలు. ఓ ప్రవక్తా! మేము మీకు వీటిని వినిపిస్తున్నాము. విషయాల్లో సత్యత, ఆదేశాల్లో న్యాయం ఉంటుంది. నిస్సందేహంగా నువ్వు సకల లోకాల ప్రభువు తరపు నుండి దైవసందేశహరులలోని వాడవు.