×

البقرة

ఆయత్ 128

అల్-ముఖ్తసర్

رَبَّنَا وَٱجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴿١٢٨﴾

ఓ మాప్రభూ మమ్మల్ని, నీకు విధేయత చూపేవారిగా,నీ భీతి పరులుగా,నీతోపాటు ఎవరినీ సాటి కల్పించని వారిగా చేయి.మరియు నీవు మా సంతానములో నుంచి ఒక జాతిని నీకు విధేయత చూపే వారిగా చేయి.మరియు నిన్ను ఏవిధంగా ఆరాధించాలో మాకు తెలియజేయి.మరియు మా పాపములను,నీకు విధేయత చూపటంలో మా లోపములను మన్నించు.నిశ్చయంగా నీ క్షమాపణ కోరే నీ దాసులని మన్నించేవాడివి,వారిపై కనికరించేవాడివి నీవే.