అల్-ముఖ్తసర్
لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّٱتَّبَعُوكَ وَلَـٰكِنۢ بَعُدَتْ عَلَيْهِمُ ٱلشُّقَّةُ ۚ وَسَيَحْلِفُونَ بِٱللَّهِ لَوِ ٱسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَٱللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿٤٢﴾
ఓ ప్రవక్తా యుద్ధం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరిన కపటులను మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో ఒక వేళ అది సులభంగా లభించే యుద్ధ ప్రాప్తి అయితే,ఎటువంటి కష్టములేని ప్రాయాణము అయితే వారు తప్పకుండా మిమ్మల్ని అనుసరించేవారు.కాని శతృవుల వైపు చేదించటానికి మీరు వారిని పిలిచిన ప్రయాణం దూరం అయిపోయింది.అయితే వారు వెనుక ఉండిపోయారు.వెనుక ఉండటం విషయంలో అనుమతి పొందిన ఈ కపటులందరు మీరు వారి వద్దకు వెళ్ళినప్పుడు ఇలా పలుకుతూ అల్లాహ్ పై ప్రమాణం చేస్తారు : ఒక వేళ మేము మీతోపాటు యుద్ధమునకు బయలుదేరే శక్తిని కలిగి ఉంటే తప్పకుండా మేము బయలుదేరే వాళ్ళము.వారి యుద్ధము నుండి వెనుక ఉండిపోవటం వలన,వారి ఈ అబద్దపు ప్రమాణాల వలన తమ ప్రాణములను అలాహ్ శిక్షకు సమర్పించుకుని స్వయాన నాశనమైపోయారు.మరియు వారు తమ వాదనల్లో,తమ ఈ ప్రమాణాల్లో అసత్యులని అల్లాహ్ కు తెలుసు.