×

التوبة

ఆయత్ 25

అల్-ముఖ్తసర్

لَقَدْ نَصَرَكُمُ ٱللَّهُ فِى مَوَاطِنَ كَثِيرَةٍ ۙ وَيَوْمَ حُنَيْنٍ ۙ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنكُمْ شَيْـًٔا وَضَاقَتْ عَلَيْكُمُ ٱلْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُم مُّدْبِرِينَ ﴿٢٥﴾

ఓ విశ్వాసపరులారా చాలా యుద్ధాల్లో మీరు కారకాలను ఎంచుకొని అల్లాహ్ పై నమ్మకమును చూపినప్పుడు మీ సంఖ్యా బలం తక్కువగా ఉండి,మీరు బలహీనులుగా ఉన్నా కూడా అల్లాహ్ మీ శతృవులైన ముష్రికులపై విజయాన్ని కలిగించాడు. మీరు ఎక్కువగా ఉండటం మీకు గర్వకారణం కాలేదు. అలాగే అధికము వారిపై మీ విజయానికి కారణం కాలేదు. కాని హునైన్ యుద్ధం రోజున మీ సంఖ్యాబలం ఆధికము మీకు గర్వకారణమైనది. అప్పుడు మీరు మేము తక్కువగా ఉన్నా ఓడిపోము అన్నారు. మీకు గర్వకారణమైన మీ సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం మీకు కొంచము కూడా ప్రయోజనం చేకూర్చలేదు. అయితే మీపై మీ శతృవులు గెలిచారు. నేల విశాలంగా ఉన్నప్పటికీ మీపై ఇరుకుగా అయిపోయింది. ఆపిదప మీరు పరాజయమునకు గురై మీ శతృవుల ముందు నుండి వెన్ను తిప్పి పారిపోయారు.