అల్-ముఖ్తసర్
أَوَعَجِبْتُمْ أَن جَآءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَٱذْكُرُوٓا۟ إِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنۢ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِى ٱلْخَلْقِ بَصْۜطَةً ۖ فَٱذْكُرُوٓا۟ ءَالَآءَ ٱللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ ﴿٦٩﴾
ఏమి దైవ దూతల వర్గంలో నుంచి కాకుండా మరియు జిన్నుల వర్గంలో నుండి కాకుండా మీ వర్గంలో నుండి ఒక వ్యక్తి నోట మీ ప్రభువు తరపు నుండి మిమ్మల్ని హెచ్చరించటానికి ఒక హితోపదేశం మీ వద్దకు రావటం మీ ఆశ్చర్యమును,అచ్చెరువును పెంచినదా ?. మీ కొరకు భూమిలో నివాసమేర్పరచినందుకు మరియు నూహ్ జాతి వారిని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన వినాశనమునకు గురి చేసిన పిదప వారి వారసులుగా మిమ్మల్ని నియమించినందుకు మీ ప్రభువు స్థుతులను పలకండి,ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు శరీరాల్లో అపార బలాధిక్యతను,పట్టుదల ప్రసాదించి మిమ్మల్ని ప్రత్యేకించినందుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీపై ఉన్న అల్లాహ్ విశాల అనుగ్రహాలను మీరు కోరుకుంటున్న దానిలో సాఫల్యం చెందుతారని,భయము నుండి బయటపడతారని ఆశిస్తూ మీరు గుర్తు చేసుకోండి.