×

الأعراف

ఆయత్ 179

అల్-ముఖ్తసర్

وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِّنَ ٱلْجِنِّ وَٱلْإِنسِ ۖ لَهُمْ قُلُوبٌ لَّا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَّا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ ءَاذَانٌ لَّا يَسْمَعُونَ بِهَآ ۚ أُو۟لَـٰٓئِكَ كَٱلْأَنْعَـٰمِ بَلْ هُمْ أَضَلُّ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْغَـٰفِلُونَ ﴿١٧٩﴾

మా (ముందస్తు) జ్ఞానము వలన ఎంతో మంది జిన్నాతులను,ఎంతో మంది మానవులను వారు నరక వాసుల చర్యకు పాల్పడుతారని నరకం కొరకు సృష్టించినాము. వారికి హృదయాలు ఉన్నవి వాటి ద్వారా వారు తమకు ఏది లాభం చేకూరుస్తుందో,ఏది నష్టం కలిగిస్తుందో గ్రహించలేరు. వారికి కళ్ళు ఉన్నవి వాటి ద్వారా వారు తమలో,సృష్టిలో ఉన్న అల్లాహ్ యొక్క సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి చూడలేరు. వారికి చెవులు ఉన్నవి వాటి ద్వారా అల్లాహ్ యొక్క ఆయతుల్లో ఉన్న దానిని యోచన చేయటానికి వినలేరు. ఈ గుణాలను కలిగిన వీరందరు బుద్దిని కోల్పోవటంలో పశువుల్లాంటి వారు. కాదు వారు మార్గ విహీనతలో పశువుల కంటే చాలా దూరం వెళ్ళిపోయారు. వారందరు అల్లాహ్ పై,పరలోకం పై విశ్వాసము నుండి పరధ్యానంలో పడిపోయారు.