అల్-ముఖ్తసర్
وَٱكْتُبْ لَنَا فِى هَـٰذِهِ ٱلدُّنْيَا حَسَنَةً وَفِى ٱلْـَٔاخِرَةِ إِنَّا هُدْنَآ إِلَيْكَ ۚ قَالَ عَذَابِىٓ أُصِيبُ بِهِۦ مَنْ أَشَآءُ ۖ وَرَحْمَتِى وَسِعَتْ كُلَّ شَىْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَٱلَّذِينَ هُم بِـَٔايَـٰتِنَا يُؤْمِنُونَ ﴿١٥٦﴾
మరియు నీవు ఎవరినైతే ఇహలోకంలో అనుగ్రహాల ద్వారా,మన్నింపుల ద్వారా గౌరవాన్ని ప్రసాదించావో,సత్కార్యములు చేయటానికి సౌభాగ్యమును ప్రసాదించావో,ఎవరి కొరకైతే నీవు నీ దాసుల్లోంచి పుణ్యాత్ముల కొరకు పరలోకంలో స్వర్గాన్ని తయారు చేశావో మమ్మల్ని వారిలోంచి చేయి. నిశ్చయంగా మేము మా తప్పిదమును (లోపమును) అంగీకరించి నీ వైపునకు తౌబా చేస్తున్నాము,మరలుతున్నాము. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు : దౌర్భాగ్య కారకాల ద్వారా ఆచరించే వారిలోంచి నేను కోరుకున్న వారికి నా శిక్షను కలిగింప చేస్తాను. నా యొక్క కారుణ్యం ఇహలోకంలో ప్రతి వస్తువును ఆవరించి ఉన్నది. అల్లాహ్ కారుణ్యం చేరకుండా ఏ సృష్టిరాసి లేదు. దాన్ని (సృష్టిరాసిని) ఆయన అనుగ్రహం,ఆయన ఉపకారం కప్పి ఉన్నది. అయితే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాటించేవారు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే వారి కొరకు,ఎవరైతే తమ సంపద నుండి జకాత్ తీసి దాని హక్కు దారులకు ఇస్తారో వారి కొరకు,ఎవరైతే నా ఆయతులపై విశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు తొందరలోనే నేను పరలోకంలో నా కారుణ్యమును వ్రాస్తాను.