×

الأعراف

ఆయత్ 155

అల్-ముఖ్తసర్

وَٱخْتَارَ مُوسَىٰ قَوْمَهُۥ سَبْعِينَ رَجُلًا لِّمِيقَـٰتِنَا ۖ فَلَمَّآ أَخَذَتْهُمُ ٱلرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُم مِّن قَبْلُ وَإِيَّـٰىَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ ٱلسُّفَهَآءُ مِنَّآ ۖ إِنْ هِىَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَآءُ وَتَهْدِى مَن تَشَآءُ ۖ أَنتَ وَلِيُّنَا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا ۖ وَأَنتَ خَيْرُ ٱلْغَـٰفِرِينَ ﴿١٥٥﴾

మూసా తన జాతి వారిలోంచి ఉత్తములైన డెబ్బై మందిని తన జాతి వారిలోంచి మూర్ఖులు ఆవు దూడ ఆరాధనకు పాల్పడిన దాని గురించి తమ ప్రభువు వద్ద క్షమాపణ కోరటాన్ని ఎన్నుకున్నారు. వారు హాజరు కావటానికి ఒక నిర్ధారిత సమయమును అల్లాహ్ వారికి వాగ్ధానం చేశాడు. వారు హాజరు అయినప్పుడు అల్లాహ్ ముందు ధైర్యం చూపారు,అల్లాహ్ ను వారికి ప్రత్యక్షంగా చూపించమని మూసాతో కోరారు. వారికి భూకంపం చుట్టుముట్టింది. దాని భయం వలన వారు స్పృహ కోల్పోయారు. చనిపోయారు. ఆ తరువాత మూసా తన ప్రభువుతో కడు వినయంగా వేడుకున్నారు,ఇలా పలికారు : ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని తుదిముట్టించదలచుకుంటే,నన్ను వారితోపాటు నేను వారి వద్దకు రాక ముందు తుదిముట్టించదలచుకుంటే నీవు వారిని వినాశనమునకు గురి చేసే వాడివి. ఏమి నీవు మాలోని బుద్ది తక్కువ వారు చేసిన పనికి మమ్మల్ని వినాశనమునకు గురి చేస్తావా ?. నా జాతి వారు ఆవు దూడ ఆరాధనకు పాల్పడినది కేవలం పరీక్ష మాత్రమే,దాని ద్వారా నీవు కోరుకున్న వారిని అపమార్గానికి గురి చేస్తావు,నీవు కోరుకున్న వారిని సన్మార్గం చూపుతావు. నీవే మా విషయాలకు సంరక్షకుడవు. అయితే నీవు మా పాపములను మన్నించు. మాపై నీ విశాలమైన కరుణను కురిపించు. పాపములను మన్నించే,తప్పిదాలను క్షమించే గొప్ప వాడివి నీవే.