×

الأنعام

ఆయత్ 159

అల్-ముఖ్తసర్

إِنَّ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِى شَىْءٍ ۚ إِنَّمَآ أَمْرُهُمْ إِلَى ٱللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُوا۟ يَفْعَلُونَ ﴿١٥٩﴾

నిశ్చయంగా యూదులు,క్రైస్తవులు ధర్మములోంచి కొన్ని వాటిని తీసుకుని కొన్ని వాటిని వదిలి వేసి తమ ధర్మమును వేరు వేరు చేసుకున్నారు. వారు వేరు వేరు వర్గాలుగా అయిపోయారు. ఓ ప్రవక్త ఏ విషయంలో కూడా మీకు వారితో సంబంధం లేదు. వారు ఉన్న అపమార్గము నుండి మీరు నిర్దోషులు. కేవలం వారిని హెచ్చరించే బాధ్యత మీపై కలదు. వారి వ్యవహారం దైవాదీనమై ఉంది. ఆయన ప్రళయదినాన ఇహలోకంలో వారు చేసిన కర్మలగురించి వారికి తెలియపరుస్తాడు. ఆయన వాటి పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.