×

الأنعام

ఆయత్ 148

అల్-ముఖ్తసర్

سَيَقُولُ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَآ أَشْرَكْنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَىْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا۟ بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَآ ۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ ﴿١٤٨﴾

ముష్రికులు అల్లాహ్ తోపాటు వారి సాటి కల్పించటం సరైనదనటంపై అల్లాహ్ చిత్తము,ఆయన తఖ్దీరు ద్వారా వాదిస్తూ తొందరలోనే ఇలా అంటారు : ఒక వేళ అల్లాహ్ మేము సాటి కల్పించ కూడదని,మరియు మా తాత ముత్తాతలు సాటి కల్పించ కూడదని అనుకుంటే మేము ఆయన తోపాటు సాటి కల్పించేవారము కాదు. ఒక వేళ అల్లాహ్ మేము మాపై నిషేదించుకున్న వాటిని నిషేదించుకో కూడదని అనుకుంటే మేము వాటిని నిషేదించుకునే వారము కాదు. వారి నిరాకరించిన వాదన వలె వారికన్న మునుపు వారు తమ ప్రవక్తలను ఇలా తెలుపుతూ తిరస్కరించారు : ఒక వేళ మేము వారిని తిరస్కరించ కూడదని అల్లాహ్ అనుకుంటే మేము వారిని తిరస్కరించే వాళ్ళము కాదు. మేము వారిపై కురిపించిన శిక్షను రుచి చూసే వరకు వారు ఈ తిరస్కరణను కొనసాగించారు. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : మీరు అల్లాహ్ తోపాటు సాటి కల్పించటాన్ని,ఆయన హరామ్ చేసిన వాటిని మీరు హలాల్ చేసుకోవటాన్ని,ఆయన హలాల్ చేసిన వాటిని మీరు హరామ్ చేసుకోవటాన్ని ఆయన మీతో ప్రసన్నుడైనట్లు నిరూపించే ఏదైన ఆధారం మీ వద్ద ఉన్నదా ?. అది (హలాల్,హరామ్ ) మీ ద్వారా జరగటం ఆయన మీ నుండి ప్రసన్నుడైనట్లు ఆధారం కాదు. మీరు ఈ విషయంలో కేవలం ఊహలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా ఊహ సత్యం విషయంలో దేనికి పనికి రాదు.మరియు మీరు కేవలం తిరస్కరిస్తున్నారు.