×

المائدة

ఆయత్ 11

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱذْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوٓا۟ إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ ﴿١١﴾

ఓ విశ్వాసపరులారా మీరు మీ హృదయములతో మరియు మీ నాలుకలతో అలాహ్ మీపై అనుగ్రహించినదైన శాంతి మరియు మీ శతృవుల హృదయముల్లో వారు మీపై దాడి చేసి మిమ్మల్ని నాశనం చేయటానికి తమ చేతులను మీవైపునకు చాపాలని నిర్ణయించుకున్నప్పుడు భయమును వేసిన దాన్ని గుర్తు చేసుకోండి. అయితే అల్లాహ్ వారిని మీ నుండి మరల్చి వారి నుండి మిమ్మల్ని కాపాడాడు. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భయపడండి. మరియు విశ్వాసపరులు ధార్మిక మరియు ప్రాపంచిక తమ ప్రయోజనములను పొందటంలో ఒక్కడైన అల్లాహ్ పైనే నమ్మకమును కలిగి ఉండాలి.