×

النساء

ఆయత్ 162

అల్-ముఖ్తసర్

لَّـٰكِنِ ٱلرَّٰسِخُونَ فِى ٱلْعِلْمِ مِنْهُمْ وَٱلْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَٱلْمُقِيمِينَ ٱلصَّلَوٰةَ ۚ وَٱلْمُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَٱلْمُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ أُو۟لَـٰٓئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا ﴿١٦٢﴾

కాని యూదుల్లోంచి జ్ఞానంలో పట్టు ఉండి స్థిరంగా ఉన్నవారు మరియు విశ్వసించినవారు ఓ ప్రవక్త అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ ను దృవీకరించేవారు మరియు మీ కన్న మునుపు ప్రవక్తలపై ఆయన అవతరింపజేసిన తౌరాత్,ఇంజీలు లాంటి గ్రంధములను దృవీకరించేవారు మరియు నమాజును నెలకొల్పేవారు మరియు తమ సంపదల నుండి జకాత్ ను చెల్లించేవారు. మరియు అల్లాహ్ ఒక్కడే అని ఆయనకు ఎవరు సాటి లేరని నమ్ముతారు. మరియు ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరకి మేము తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాము.