అల్-ముఖ్తసర్
كَمَآ أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُوا۟ عَلَيْكُمْ ءَايَـٰتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا۟ تَعْلَمُونَ ﴿١٥١﴾
ఏ విధంగానైతే మీలో నుంచే ఒక ప్రవక్తను మీ వద్దకు పంపి మేము ఇంకొక అనుగ్రహాన్ని మీపై కురిపించామో,అతడు మా ఆయతులను మీ ముందు చదివి వినిపిస్తున్నాడు,మంచిని,సద్గుణాలను మీకు ఆదేశిస్తూ,చెడునుంచి,దుర్గుణాలనుంచి వారిస్తూ మిమ్మల్ని ప్రక్షాళిస్తాడు,మరియు మిమ్మల్ని ఖుర్ఆన్,సున్నత్ ను బోధిస్తాడు,మరియు మీకు తెలియని మీ ఇహ,పర లోకాల విషయాలను మీకు నేర్పిస్తాడు.