అల్-ముఖ్తసర్
وَقَالُوا۟ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدًا ۗ سُبْحَـٰنَهُۥ ۖ بَل لَّهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَـٰنِتُونَ ﴿١١٦﴾
మరియు యూదులు,క్రైస్తవులు,ముష్రికులు ఇలా పలికారు : అల్లాహ్ తన కొరకు సంతానమును చేసుకున్నాడు. ఆయన దాని నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ఆయనకు తన సృష్టితాల అవసరం లేనివాడు. సంతానమును దాని అవసరం కలవాడే చేసుకుంటాడు. కాని భూమ్యాకాశముల్లో ఉన్న వాటి రాజ్యాధికారము పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన ఆయనకే చెందును. సృష్టితాలన్ని పరిశుద్ధుడైన ఆయనకు దాసులు,ఆయనకు వినయంతో ఉండేవారు. ఆయన తాను తలచుకున్న దాని ద్వారా వారిలో కార్యనిర్వహణ చేస్తాడు.