×

الإسراء

ఆయత్ 54

అల్-ముఖ్తసర్

رَّبُّكُمْ أَعْلَمُ بِكُمْ ۖ إِن يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِن يَشَأْ يُعَذِّبْكُمْ ۚ وَمَآ أَرْسَلْنَـٰكَ عَلَيْهِمْ وَكِيلًا ﴿٥٤﴾

ఓ ప్రజలారా మీ ప్రభువు మీ గురించి బాగా తెలిసినవాడు. మీ నుండి ఆయనపై ఏదీను గోప్యంగా ఉండదు. ఆయన ఒక వేళ మీపై దయ చూపదలచుకుంటే ఆయన మీకు విశ్వాసమును,సత్కార్యమును చేయటమును అనుగ్రహించటం ద్వారా మీపై దయ చూపుతాడు. ఒక వేళ ఆయన మిమ్మల్ని శిక్షించదలచుకుంటే ఆయన మిమ్మల్ని విశ్వాసము నుండి పరాభవమునకు గురి చేసి,అవిశ్వాస స్థితిలో మీకు మరణమును కలిగించి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారిని విశ్వాసమును తీసుకుని రావటానికి బలవంతం పెట్టటానికి,వారిని అవిశ్వాసము నుండి ఆపటానికి,వారి కర్మలను లెక్క పెట్టటానికి వారిపై రక్షకుడిగా (బాధ్యుడిగా) పంపించ లేదు. మీరు కేవలం అల్లాహ్ వద్ద నుండి ఆయన మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని చేరవేసేవారు మాత్రమే.