×

الإسراء

ఆయత్ 51

అల్-ముఖ్తసర్

أَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِى صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَا ۖ قُلِ ٱلَّذِى فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰٓ أَن يَكُونَ قَرِيبًا ﴿٥١﴾

లేదా మీరు ఆ రెండిటి కన్నా పెద్ద వేరే సృష్టితం ఏదైతే మీ మనస్సుల్లో పెద్దదిగా ఉన్నదో దానిలా అవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఎలా ప్రారంభించాడో అలాగే మరలింపజేస్తాడు. మిమ్మల్ని ఎలా మొదటిసారి సృష్టించాడో అలా మిమ్మల్ని(మరల) జీవింపజేస్తాడు. ఈ విభేదకులందరు ఇలా అంటారు : మమ్మల్ని మరణించిన తరువాత జీవింపజేసి మరలించేవాడు ఎవడు ?. అప్పుడు మీరు వారితో ఇలా అనండి : పూర్వ నమూనా లేకుండా మొదటిసారి మిమ్మల్ని సృష్టించిన వాడే మిమ్మల్ని మరలింపజేస్తాడు. మీరు ఎవరినైతే ఖండించారో వారు ఎగతాళిగా తమ తలలను ఊపుతారు. మరియు వారు దూరమవుతూ ఈ మరలింపు ఎప్పుడు ? అని అంటారు. మీరు బహుశా అది దగ్గరలో ఉన్నదని వారితో అనండి,ఎందుకంటే వచ్చేది ప్రతీది దగ్గరలోనే ఉన్నది.