అల్-ముఖ్తసర్
وَلِلَّهِ غَيْبُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَمَآ أَمْرُ ٱلسَّاعَةِ إِلَّا كَلَمْحِ ٱلْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿٧٧﴾
మరియు భూమ్యాకాశముల్లో గోప్యంగా ఉన్న సమస్తము యొక్క జ్ఞానము ఒక్కడైన అల్లాహ్ కే కలదు. ఆయన సృష్టితాల్లో నుండి ఏ ఒక్కడికి కాకుండా దాని జ్ఞానము ఆయనకే ప్రత్యేకము. ప్రళయదిన విషయం ఏదైతే అగోచర విషయాల్లో ప్రత్యేకించబడినదో దాన్ని ఆయన కోరుకున్నప్పుడు దాని రావటం యొక్క వేగము కను రెప్ప వాల్చి తెరిచే లోపలే లేదా దానికన్నా ఇంకా దగ్గరే. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయన్ని ఏదీ అశక్తుడిని చేయదు. ఏదైన విషయమును ఆయన కోరినప్పుడు దాన్ని ఆయన కున్ (నీవు అయిపో ) అని అంటాడు అది అయిపోతుంది.