×

النحل

ఆయత్ 76

అల్-ముఖ్తసర్

وَضَرَبَ ٱللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَآ أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَىْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَىٰهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِى هُوَ وَمَن يَأْمُرُ بِٱلْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ ﴿٧٦﴾

మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వారిని ఖండిస్తూ వేరొక ఉదాహరణ ఇద్దరి వ్యక్తులది ఇలా ఇస్తున్నాడు : వారిలో నుండి ఒకడు మూగవాడు. అతడు తన చెవిటితనం,తన మూగతనం వలన ఏమీ విన లేడు,మాట్లాడ లేడు మరియు అర్ధం చేసుకో లేడు. అతడు తనకు గాని ఇతరులకు గాని ప్రయోజనం చేయలేని అసమర్ధుడు. మరియు అతడు తనను పోషించే వాడిపై,అతని బాధ్యత తీసుకునే వాడిపై భారంగా తయారవుతాడు. అతన్ని ఎటు పంపించినా మేలును తీసుకుని రాలేడు,ఆశించిన దానిలో సఫలీకృతం కాలేడు. ఇటువంటి స్థితిలో ఉన్న వాడు ఆ వ్యక్తితో ఎవడైతే సరిగా వినగలుగుతాడో,మాట్లాడగలుగుతాడో,అతని ప్రయోజనాలు అధికము,అతడు ప్రజలను న్యాయపూరితంగా ఆదేశిస్తాడు. స్వయంగా అతను నేరుగా ఉన్నవాడు. అతడు ఎటువంటి సందేహములేని,ఎటువంటి వంకరతనము లేని స్పష్టమైన మార్గంపై ఉన్నాడు సమానుడు కాగలడా ?. అలాంటప్పుడు ఓ ముష్రికులారా ఘనమైన,పరిపూర్ణమైన లక్షణాలు గల అల్లాహ్ కి వినలేని,మాట్లాడలేని,ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేని,ఎటువంటి నష్టమును దూరం చేయలేని మీ విగ్రహాలకి మధ్య సమానత్వమును మీరు ఎలా కల్పిస్తున్నారు ?!.