అల్-ముఖ్తసర్
وَمِن ثَمَرَٰتِ ٱلنَّخِيلِ وَٱلْأَعْنَـٰبِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَعْقِلُونَ ﴿٦٧﴾
మరియు మేము మీకు ఆహారోపాధిగా ప్రసాధించిన ఖర్జూర పండ్లలో,ద్రాక్షా పండ్లలో మీ కొరకు హితబోధన ఉన్నది. వాటి నుండి మీరు మతిని పోగొట్టే మత్తు పానీయమును తయారు చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. మరియు మీరు వాటి ద్వారా ఎండు ఖర్జూరములు (డేట్స్), ఎండు ద్రాక్ష (కిష్మిష్), వెనిగార్, ద్రాక్షా రసము (పానకము) లాగా మంచి ఆహారమును తయారు చేసుకుని ప్రయోజనం చెందుతున్నారు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో బుద్ధి కలవారికి అల్లాహ్ దాసులపై కల అల్లాహ్ సామర్ధ్యము,ఆయన అనుగ్రహము పై సూచన ఉన్నది. వారే గుణపాఠం నేర్చుకుంటారు.