×

النحل

ఆయత్ 41

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ هَاجَرُوا۟ فِى ٱللَّهِ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ لَنُبَوِّئَنَّهُمْ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ ﴿٤١﴾

మరియు ఎవరైతే అవిశ్వాసపరుల చేత పీడించబడి,వారి ద్వారా ఇబ్బందులకు గురైన తరువాత అల్లాహ్ మన్నతను ఆశిస్తూ తమ ఇండ్లను,తమ కుటుంబం వారిని,తమ సంపదలను వదలి అవిశ్వాస ప్రాంతము నుండి ఇస్లాం ప్రాంతమునకు వలస పోతారో (హిజ్రత్ చేస్తారో) వారిని మేము తప్పకుండా ఇహలోకంలో ఒక నివాసములో దించుతాము వారు అందులో గౌరవం పొందినవారై ఉంటారు. మరియు పరలోక ప్రతిఫలం ఎంతో గొప్పది ఎందుకంటే దాని నుండే స్వర్గము లభిస్తుంది. ఒకవేళ హిజ్రత్ (వలసపోవటం) నుండి వెనుక ఉండిపోయిన వారు హిజ్రత్ చేసేవారి పుణ్యం గురించి తెలుసుకుని ఉంటే వారు దాని నుండి వెనుక ఉండేవారు కాదు.