అల్-ముఖ్తసర్
إِلَّا تَنفِرُوا۟ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْـًٔا ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿٣٩﴾
ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు మీ శతృవులతో పోరాడటానికి అల్లాహ్ మార్గంలో జిహాద్ కొరకు బయలుదేరకపోతే అల్లాహ్ మిమ్మల్ని ఒత్తిడి ద్వారా,అవమానానికి గురి చేయటం ద్వారా,ఇతరవాటి ద్వారా శిక్షిస్తాడు.ఆయన జిహాద్ కొరకు పిలుపునిస్తే బయలుదేరి అల్లాహ్ కు విధేయత చూపే వారిని మీకు బదులుగా తీసుకుని వస్తాడు.ఆయన ఆదేశమును మీరు వ్యతిరేకించటం వలన ఆయనకు మీరు ఎటువంటి నష్టం చేయలేరు.ఆయనకు మీ అవసరం లేదు.ఆయన అవసరము మీకు ఉన్నది.మరియు అల్లాహ్ ప్రతీ వస్తువుపై అధికారం కలవాడు.ఆయనను ఏదిను అశక్తుడిని చేయదు.మరియు ఆయన మిమ్మల్ని వదిలి తన ప్రవక్తను,తన ధర్మమును సహాయము చేయటంలో సామర్ధ్యం కలవాడు.