×

التوبة

ఆయత్ 2

అల్-ముఖ్తసర్

فَسِيحُوا۟ فِى ٱلْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَٱعْلَمُوٓا۟ أَنَّكُمْ غَيْرُ مُعْجِزِى ٱللَّهِ ۙ وَأَنَّ ٱللَّهَ مُخْزِى ٱلْكَـٰفِرِينَ ﴿٢﴾

అయితే ఓ ముష్రికులారా మీరు నాలుగు నెలల వరకు భువిలో నిశ్చింతగా సంచరించండి.దాని తరువాత మీ కొరకు ఏ ఒప్పందం ఉండదు,ఎటువంటి రక్షణ ఉండదు.ఒక వేళ ఆయన పట్ల మీరు మీ అవిశ్వాసమును కొనసాగిస్తే మీరు అల్లాహ్ శిక్ష నుండి,ఆయన యాతన నుండి విముక్తి పొందరంటే పొందరని నమ్మండి.అల్లాహ్ అవిశ్వాసపరులను ఇహలోకంలో హతమార్చి,బందీలుగా చేసి,ప్రళయదినాన నరకంలో ప్రవేశింపజేసి పరాభవంపాలు చేస్తాడని మీరు నమ్మండి.ఎవరైతే తమ ఒప్పందాలను (ప్రమాణాలను) భంగపరిచారో,ఎవరికైతే కాల పరిమితి లేకుండా ఒప్పందం ఉన్నదో వారందరు ఇందులో వస్తారు.మరియు ఎవరికైతే ఒప్పందములో కాలపరిమితి ఉన్నదో ఒక వేళ అది నాలుగు నెలల కన్న ఎక్కువ ఉన్నా కూడా దాని కాలం పూర్తి అయ్యే వరకు ఒప్పందం పూర్తి చేయబడుతుంది.