అల్-ముఖ్తసర్
وَمَا كَانَ ٱلْمُؤْمِنُونَ لِيَنفِرُوا۟ كَآفَّةً ۚ فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآئِفَةٌ لِّيَتَفَقَّهُوا۟ فِى ٱلدِّينِ وَلِيُنذِرُوا۟ قَوْمَهُمْ إِذَا رَجَعُوٓا۟ إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ ﴿١٢٢﴾
విశ్వాసపరులకు వారందరూ యుద్ధానికి బయలుదేరి వారి శతృవులు వారిపై గెలిచినప్పుడు చివరికి వారందరు తుదిముట్టించబడటం తగదు.అయితే ఎందుకు వారిలో ఒక వర్గము యుద్ధపోరాటమునకు బయలదేరకూడదు,ఇంకొక వర్గము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతోపాటు ఉండిపోయి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఖుర్ఆన్,ధర్మ ఆదేశాలను వినటం ద్వారా ధర్మవిషయాలను నేర్చుకుని తమ జాతివారి వద్దకు మరలినప్పుడు వారు అల్లాహ్ శిక్ష నుండి,ఆయన యాతన నుండి జాగ్రత్తపడుతారని ఆశిస్తూ వారిని తాము నేర్చుకున్న విషయాల ద్వారా హెచ్చరించాలి.అయితే వారు ఆయన ఆదేశాలను పాటిస్తారు,మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారు.మరియు ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పంపించే చిన్నయుద్ధ సమూహాల్లో జరిగేది.మరియు ఆయన దాని కొరకు తన సహచరుల్లోంచి ఒక వర్గాన్ని ఎన్నుకునేవారు.