అల్-ముఖ్తసర్
وَءَاخَرُونَ مُرْجَوْنَ لِأَمْرِ ٱللَّهِ إِمَّا يُعَذِّبُهُمْ وَإِمَّا يَتُوبُ عَلَيْهِمْ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴿١٠٦﴾
తబూక్ యుద్ధము నుండి వెనుక ఉండిపోయిన వారిలో ఎటువంటి కారణం చూపని ఇంకొక వర్గము ఉంది.వీరందరూ అల్లాహ్ తీర్పు కొరకు,వారి విషయంలో ఆయన నిర్ణయం కొరకు వాయిదా వేయబడ్డారు.ఆయన వారి విషయంలో తాను కోరుకున్న విధంగా తీర్పు ఇస్తాడు : ఒక వేళ వారు ఆయనతో పశ్చాత్తాప్పడకుండా ఉంటే (తౌబా చేయకుండా ఉంటే) వారిని శిక్షించటం,ఒక వేళా వారు పశ్చాత్తాప్పడితే వారిని మన్నించటం.ఆయన శిక్షకు అర్హులు ఎవరో,ఆయన మన్నింపుకు అర్హులు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.తన ధర్మ శాసనాల్లో,తన పర్యాలోచనలో (తద్బీరులో) వివేకవంతుడు.మరియు వారందరు మురార బిన్ రబీఅ్,కఅబ్ బిన్ మాలిక్,హిలాల్ బిన్ ఉమయ్యహ్.