×

الأعراف

ఆయత్ 73

అల్-ముఖ్తసర్

وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَـٰلِحًا ۗ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ قَدْ جَآءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ ۖ هَـٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمْ ءَايَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِىٓ أَرْضِ ٱللَّهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٧٣﴾

మరియు మేము సమూద్ జాతి వారి వైపునకు వారి సోదరుడు సాలిహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము. ఆయన వారిని అల్లాహ్ ఏకత్వం వైపున,అతని ఆరాధన వైపునకు పిలిచారు. సాలిహ్ వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆయన కాకుండా వేరే వారు ఆరాధనకు అర్హులు,ఆరాధ్య దైవాలు కారు. నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది సత్యం అవటంలో అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన సూచన మీ వద్దకు వచ్చినది. ఒక ఒంటె మాదిరిగా అది ఒక రాతి బండ నుండి వెలికి వస్తుంది. నీరు త్రాగటానికి దాని కొరకు ఒక సమయం ఉంటుంది. మరియు మీ కొరకు నీరు త్రాగటానికి ఒక నిర్దేశిత రోజు ఉంటుంది. దానిని అల్లాహ్ నేలలో తినటానికి వదిలి వేయండి. మీరు దానికి సరఫరా చేయవలసిన అవసరం లేదు. దానికి మీరు హాని తలపెట్టకండి. ఒక వేళ అదే జరిగితే దాన్ని బాధ పెట్టటం వలన మీ పై బాధాకరమైన శిక్ష వచ్చి చేరుతుంది.