×

الأعراف

ఆయత్ 37

అల్-ముఖ్తసర్

فَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِـَٔايَـٰتِهِۦٓ ۚ أُو۟لَـٰٓئِكَ يَنَالُهُمْ نَصِيبُهُم مِّنَ ٱلْكِتَـٰبِ ۖ حَتَّىٰٓ إِذَا جَآءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوٓا۟ أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ ۖ قَالُوا۟ ضَلُّوا۟ عَنَّا وَشَهِدُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا۟ كَـٰفِرِينَ ﴿٣٧﴾

అల్లాహ్ తో పాటు సాటి కల్పించి అబద్దమును అంటగట్టి లేదా లోపమును కల్పించి లేదా ఆయన చెప్పని మాటలను ఆయన చెప్పినట్లు కల్పించి లేదా సన్మార్గమైన ఆయన మార్గము వైపునకు దర్శకం వహించే ఆయన గొప్ప ఆయతులను అబద్దమని తిరస్కరించే వాడికన్న పెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు. ఈ లక్షణాలు కలిగిన వారందరు ప్రాపంచిక సుఖాల్లోంచి లౌహె మహ్ఫూజ్ లో వారి కొరకు వ్రాయబడిన వారి వాటా వారికి లభిస్తుంది. చివరికి వారి వద్దకు వారి ఆత్మలను తీసుకొనుట కొరకు మరణ దూత, దైవ దూతల్లోంచి అతని సహాయకులు వారి వద్దకు వచ్చినప్పుడు వారిని మందలిస్తూ ఇలా అంటారు : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఇతర దేవుళ్లు ఎక్కడ ?. మీకు లాభం చేకూర్చటానికి వారిని మీరు పిలవండి. అప్పుడు ముష్రికులు దైవ దూతలకు సమాధానమిస్తూ ఇలా అంటారు : మేము ఆరాధించే దేవుళ్ళు మా నుండి వెళ్ళిపోయారు,అదృశ్యమైపోయారు. వారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మరియు వారు తాము అవిశ్వాసపరులని స్వయంగా అంగీకరిస్తారు. కాని ఆ సమయంలో వారి అంగీకారము వారికి వ్యతిరేకంగా వాదన అవుతుంది,వారికి ప్రయోజనం చేకూర్చదు.