×

الأعراف

ఆయత్ 175

అల్-ముఖ్తసర్

وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ ٱلَّذِىٓ ءَاتَيْنَـٰهُ ءَايَـٰتِنَا فَٱنسَلَخَ مِنْهَا فَأَتْبَعَهُ ٱلشَّيْطَـٰنُ فَكَانَ مِنَ ٱلْغَاوِينَ ﴿١٧٥﴾

ఓ ప్రవక్తా ఇస్రాయీలు సంతతి వారికి ఆ వ్యక్తి యొక్క సమాచారమును (వృత్తాంతమును) చదివి వినిపించండి. అతనికి మేము మా సూచనలను (ఆయతులను) ప్రసాదించినాము. అతడు వాటిని తెలుసుకున్నాడు. అవి నిర్దేశిస్తున్న సత్యమును అతను అర్ధం చేసుకున్నాడు. కాని అతను వాటిని ఆచరించలేదు. అంతే కాదు అతడు వాటిని వదిలేశాడు,వాటి నుండి దూరమైపోయాడు. అప్పుడు షైతాను అతని వెంట పడిపోయాడు. అతనికి స్నేహితుడైపోయాడు. అయితే అతడు సన్మార్గం పొంది సాఫల్యం చెందిన వారిలోంచి అయిన తరువాత మార్గభ్రష్టుడై వినాశనం పొందే వారిలోంచి అయిపోయాడు.