×

الأعراف

ఆయత్ 150

అల్-ముఖ్తసర్

وَلَمَّا رَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوْمِهِۦ غَضْبَـٰنَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِى مِنۢ بَعْدِىٓ ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى ٱلْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُۥٓ إِلَيْهِ ۚ قَالَ ٱبْنَ أُمَّ إِنَّ ٱلْقَوْمَ ٱسْتَضْعَفُونِى وَكَادُوا۟ يَقْتُلُونَنِى فَلَا تُشْمِتْ بِىَ ٱلْأَعْدَآءَ وَلَا تَجْعَلْنِى مَعَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿١٥٠﴾

మరియు మూసా తన ప్రభువుతో సంభాషణంతరం తన జాతి వారి వైపునకు మరలినప్పుడు ఆవు దూడ ఆరాధనలో వారిని పొందినందుకు వారిపై ఆగ్రహంతో నిండి ,విచారముతో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నేను మీ వద్ద నుండి వెళ్ళిన తరువాత మీరు నా ప్రాతినిధ్యం వహించి చేసిన స్థితి అది వినాశనమును,కష్టమును చేకూర్చటం వలన ఎంత చెడ్డదైనది. ఏమి మీరు నా కోసం ఎదురు చూస్తూ అలసిపోయి ఆవు దూడ ఆరాధనకు పాల్పడ్డారా ?. వారి వలన ఆయనకు కలిగిన తీవ్ర ఆగ్రహానికి,దఃఖానికి పలకలను విసిరి వేశారు. తన సోధరుడు హారూన్ వారితోపాటు ఉండి కూడా వారు ఆవు దూడ ఆరాధన చేస్తుంటే చూసి ఆయన మార్పు తీసుకుని రానందుకు అతని తలను,గెడ్డమును పట్టి తన వైపునకు గుంజసాగారు. హారున్ మూసాతో క్షమాపణ కోరుతూ,తనపై దయ చూపమని ఇలా విన్నపించుకున్నారు : ఓ నా తల్లి కుమారా ( నా సోదరా) నిశ్చయంగా జాతి వారు నన్ను బలహీనుడిగా భావించి నన్ను అవమానపాలు చేసారు,దగ్గర దగ్గర నన్ను చంపివేసేవారు,మీరు నా శతృవులు సంతోషపడటానికి నన్ను ఏ శిక్షకూ గురి చేయకండి. మీకు నాపై కోపం వలన జాతి వారిలోంచి అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన చేయటం వలన దుర్మార్గులైన వారిలో నన్ను లెక్క వేయకండి.