అల్-ముఖ్తసర్
وَوَٰعَدْنَا مُوسَىٰ ثَلَـٰثِينَ لَيْلَةً وَأَتْمَمْنَـٰهَا بِعَشْرٍ فَتَمَّ مِيقَـٰتُ رَبِّهِۦٓ أَرْبَعِينَ لَيْلَةً ۚ وَقَالَ مُوسَىٰ لِأَخِيهِ هَـٰرُونَ ٱخْلُفْنِى فِى قَوْمِى وَأَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيلَ ٱلْمُفْسِدِينَ ﴿١٤٢﴾
మరియు అల్లాహ్ మూసాతో సంభాషించటం కొరకు ముప్పై రాత్రుల వాగ్ధానం చేశాడు. ఆ పిదప వాటిని అల్లాహ్ పది పెంచి పరిపూర్ణం చేశాడు. అప్పుడు అవి నలభై అయినవి. ఎప్పుడైతే మూసా తన ప్రభువుతో సంభాషన కొరకు వెళ్ళదలచుకున్నారో తన సోదరుడు హారూనుతో ఇలా పలికారు : ఓ హారూన్ నీవు నా జాతివారిలో నా ప్రతినిధిగా ఉండు. మరియు నీవు వారి వ్యవహారాలను ఉత్తమ పరిపాలన ద్వారా,వారి పట్ల మృధు వైఖరి ద్వారా చక్కదిద్దు (సంస్కరించు). పాపాలకు పాల్పడి నీవు అరాచకాలు చేసేవారి మార్గంలో నడవకు. అవిధేయులకు సహాయకుడిగా నీవు అవ్వకు.