అల్-ముఖ్తసర్
وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ ٱلرِّجْزُ قَالُوا۟ يَـٰمُوسَى ٱدْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ ۖ لَئِن كَشَفْتَ عَنَّا ٱلرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِىٓ إِسْرَٰٓءِيلَ ﴿١٣٤﴾
ఈ విషయాల ద్వారా వారికి శిక్ష కలిగినప్పుడు వారు మూసా వైపునకు మరలారు,ఆయనతో ఇలా పలికారు : ఓ మూసా నీ ప్రభువు నీకు ప్రత్యేకించిన దైవదౌత్యం (నుబువ్వత్) ద్వారా,శిక్షను తౌబా ద్వారా తొలగిస్తానని నీకు ఆయన చేసిన వాగ్దానం ద్వారా మాపై వచ్చిన శిక్షను మా నుండి తొలగించమని మా కొరకు నీ ప్రభువుతో వేడుకో. ఒకవేళ నీవు దాన్ని మా నుండి తొలగిస్తే నిన్ను తప్పకుండా విశ్వసిస్తాము,ఇస్రాయీల్ సంతతివారిని మేము నీతో పాటు తప్పకుండా పంపిస్తాము,వారిని మేము విముక్తి కలిగిస్తాము.