అల్-ముఖ్తసర్
وَقَالُوا۟ مَهْمَا تَأْتِنَا بِهِۦ مِنْ ءَايَةٍ لِّتَسْحَرَنَا بِهَا فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ ﴿١٣٢﴾
ఫిర్ఔన్ జాతివారు సత్యాన్ని వ్యతిరేకిస్తూ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఏ మహిమను,ఆధారమును నీవు మా వద్దకు తీసుకుని వచ్చినా,మా వద్ద ఉన్న దాని నుండి మమ్మల్ని మరల్చటానికి మా వద్ద ఉన్నది అసత్యము అని నిరూపించటం కొరకు,నీవు తీసుకుని వచ్చినది సత్యము అనటం కొరకు నీవు ఏ వాదనను స్థాపించినా మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము.