×

الأنعام

ఆయత్ 68

అల్-ముఖ్తసర్

وَإِذَا رَأَيْتَ ٱلَّذِينَ يَخُوضُونَ فِىٓ ءَايَـٰتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا۟ فِى حَدِيثٍ غَيْرِهِۦ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ ٱلشَّيْطَـٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ ٱلذِّكْرَىٰ مَعَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٦٨﴾

ఓ ప్రవక్తా మీరు ముష్రికులను మా సూచనల (ఆయతుల) విషయంలో హేళన చేస్తూ,ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నప్పుడు చూస్తే వారు మా సూచనల విషయంలో హేళన,ఎగతాళి లేకుండా వేరే మాటలు మాట్లాడనంతవరకు వారినుండి దూరంగా ఉండండి.షైతాను మిమ్మల్ని మరపింపజేసినప్పుడు వారితోపాటు మీరు కూర్చుంటే ఆతరువాత మీకు గుర్తు వస్తే వారు కూర్చున్న ప్రదేశమును వదిలివేయండి.హద్దుమీరే వీరందరితోపాటు మీరు కూర్చోకండి.