అల్-ముఖ్తసర్
قُلْ أَرَءَيْتُمْ إِنْ أَخَذَ ٱللَّهُ سَمْعَكُمْ وَأَبْصَـٰرَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِهِ ۗ ٱنظُرْ كَيْفَ نُصَرِّفُ ٱلْـَٔايَـٰتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ ﴿٤٦﴾
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: ఒక వేళ అల్లాహ్ మీ వినే శక్తిని తీసుకుని మిమ్మల్ని చెవిటివారిగా,మీ చూపుని తీసుకుని మిమ్మల్ని గ్రుడ్డి వారిగా చేసి మీ యొక్క హృదయములపై సీలు వేస్తే మీరు వాటిని కోల్పోయిన తరువాత మీ వద్దకు వాటిని తీసుకుని వచ్చే సత్య ఆరాధ్యదైవం ఎవరో నాకు చెప్పండి.ఓ ప్రవక్త మేము వారి కొరకు వాదనలను ఎలా వివరించామో,రకరకాల ఆధారాలను ఎలా చూపామో,ఆ తరువాత వారు వాటి పట్ల ఏ విదంగా విముఖత చూపారో చూడండి.