అల్-ముఖ్తసర్
قُلْ تَعَالَوْا۟ أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًا ۖ وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَـٰدَكُم مِّنْ إِمْلَـٰقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا۟ ٱلْفَوَٰحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا۟ ٱلنَّفْسَ ٱلَّتِى حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَعْقِلُونَ ﴿١٥١﴾
ఓ ప్రవక్తా మీరు ప్రజలతో ఇలా అనండి : మీరు రండి అల్లాహ్ నిషేదించిన వాటిని మీకు నేను చదివి వినిపిస్తాను. అల్లాహ్ సృష్టితాల్లోంచి దేనిని కూడా మీరు ఆయనతో పాటు సాటి కల్పించటాన్ని,మీ తల్లిదండ్రులపట్ల మీరు అవిధేయతకు పాల్పడటంను,కాని వారితో మంచిగా మెలగటం మీపై తప్పనిసరి.పేదరికం కారణం చేత మీ సంతానమును మీరు హత్య చేయటంను మీ పై నిషేదించాడు. ఏ విధంగానైతే అజ్ఞానులు చేసేవారో ఆవిధంగా. మేమే మీకు ఆహారాన్ని ప్రసాధిస్తాము,వారికి ఆహారాన్ని ప్రసాధిస్తాము. సిగ్గుమాలిన పనులు అవి బాహటంగా జరిగేవైనా,గుట్టుగా జరిగేవైనా వాటికి మీరు దగ్గరవటాన్ని,అల్లాహ్ దేని హత్య చేయటంను నిషేధించాడో దానిని మీరు ఆ ప్రాణమును హత్య చేయటంను మీపై నిషేధించాడు. కాని సత్యబద్ధంగా వివాహం తరువాత వ్యభిచారం చేయటం,ఇస్లాం స్వీకరించిన తరువాత ఇస్లాం నుండి మరలి పోవటం లాంటివి. మీరు అల్లాహ్ ఆదేశించిన వాటిని,ఆయన వారించిన వాటిని అర్ధం చేసుకుంటారని ఆయన ఈ ప్రస్తావించిన వాటి ద్వారా మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు.