అల్-ముఖ్తసర్
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَـٰمَعْشَرَ ٱلْجِنِّ قَدِ ٱسْتَكْثَرْتُم مِّنَ ٱلْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَآؤُهُم مِّنَ ٱلْإِنسِ رَبَّنَا ٱسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَآ أَجَلَنَا ٱلَّذِىٓ أَجَّلْتَ لَنَا ۚ قَالَ ٱلنَّارُ مَثْوَىٰكُمْ خَـٰلِدِينَ فِيهَآ إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ ﴿١٢٨﴾
ఓ ప్రవక్తా ఒకసారి ఆ రోజును గుర్తు చేసుకోండి ఏ రోజునైతే అల్లాహ్ మానవులను,జిన్నాతులను (సఖలైన్ ను) సమీకరిస్తాడు. ఆ తరువాత వారితో అల్లాహ్ ఇలా అంటాడు : ఓ జిన్నుల వర్గీయులారా మీరు మానవులను మార్గభ్రష్టులను చేయటంను,అల్లాహ్ మార్గము నుంచి వారిని ఆపటంను ఎక్కువ చేశారు. మానవుల్లోంచి వారిని అనుసరించేవారు తమ ప్రభువుకు జవాబిస్తూ ఇలా అంటారు : ఓ మా ప్రభువా మాలోంచి ప్రతి ఒక్కరు తమ తోటి వారితో లబ్ది పొందారు. జిన్ను మానవుడు తనపై విధేయత చూపటాన్ని ఆస్వాదించేవాడు. మానవుడు తన కోరికలను పొంది లబ్ది పొందేవాడు. మరియు మేము నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు చేరుకున్నాము. అది ప్రళయదినము. అల్లాహ్ ఇలా అంటాడు : నరకాగ్ని మీ శాస్వత నివాసస్థలము. మీరు అందులో ఎల్లప్పుడు ఉంటారు. వారు వారి సమాధుల నుండి లేవబడటం నుండి వారు నరకమునకు చేరటం మధ్య ఏదైతే గడువు ఉన్నదో దాన్ని అల్లాహ్ తలచుకుంటే తప్ప. ఈ గడువు అల్లాహ్ వారు నరకములో శాస్వతంగా ఉండటం నుండి మినహాయించిన గడువు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు తన విధివ్రాత విషయంలో,తన నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి,వారిలో నుండి ఎవరు శిక్షకు అర్హులో తెలిసినవాడు.