×

المائدة

ఆయత్ 60

అల్-ముఖ్తసర్

قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ ٱللَّهِ ۚ مَن لَّعَنَهُ ٱللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ ٱلْقِرَدَةَ وَٱلْخَنَازِيرَ وَعَبَدَ ٱلطَّـٰغُوتَ ۚ أُو۟لَـٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَآءِ ٱلسَّبِيلِ ﴿٦٠﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : వీరందరికన్న ఎవరు ఎక్కువ నిందకు మరియు తీవ్ర శిక్షకు అర్హులో నేను మీకు తెలుపనా. నిశ్చయంగా వారే ఎవరినైతే అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేసి వారి రూపాలను మర్చిన తరువాత కోతులుగా పందులుగా మార్చి వేశాడో మరియు వారిలో నుండి కొందరిని తాగూత్ లకు దాస్యం చేసే వారిగా చేశాడో, అల్లాహ్ ను వదిలి ఇష్టతతో ఎవరి ఆరాధన చేయబడునో దాన్ని తాగూత్ అంటారు. ఈ ప్రస్తావించబడిన వారందరు ప్రళయదినమున చెడ్డ స్థానము కలవారు మరియు ఋజుమార్గము నుండి తప్పిపోయిన వారు.