×

المائدة

ఆయత్ 19

అల్-ముఖ్తసర్

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ قَدْ جَآءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ ٱلرُّسُلِ أَن تَقُولُوا۟ مَا جَآءَنَا مِنۢ بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَآءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ ﴿١٩﴾

ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధవహులారా నిశ్చయంగా ప్రవక్తల్లోంచి రాక తెగిపోయిన తరువాత మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు. మరియు ఆయనను ప్రవక్తగా పంపటం ఎంతో అవసరం. అల్లాహ్ ప్రతిఫలం గురించి మాకు శుభవార్తనిచ్చే మరియు ఆయన శిక్ష నుండి మమ్మల్ని హెచ్చరించే ఏ ప్రవక్త మా వద్దకు రాలేదని మీరు వంకలు పెడుతూ పలకకుండా ఉండటానికి. నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ప్రతిఫలం గురించు శుభవార్తనిస్తూ మరియు ఆయన శిక్ష నుండి హెచ్చరిస్తూ మీ వద్దకు వచ్చారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. ప్రవక్తలను పంపించటం మరియు వారి (పరంపరను) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంతం చేయటం ఆయన సామర్ధ్యంలోంచిదే.