×

المائدة

ఆయత్ 13

అల్-ముఖ్తసర్

فَبِمَا نَقْضِهِم مِّيثَـٰقَهُمْ لَعَنَّـٰهُمْ وَجَعَلْنَا قُلُوبَهُمْ قَـٰسِيَةً ۖ يُحَرِّفُونَ ٱلْكَلِمَ عَن مَّوَاضِعِهِۦ ۙ وَنَسُوا۟ حَظًّا مِّمَّا ذُكِّرُوا۟ بِهِۦ ۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَآئِنَةٍ مِّنْهُمْ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۖ فَٱعْفُ عَنْهُمْ وَٱصْفَحْ ۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُحْسِنِينَ ﴿١٣﴾

వారితో తీసుకోబడిన ప్రమాణమును వారు భంగపరచటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి గెంటివేశాము. మరియు వారి హృదయములను గట్టిగా,కఠినంగా చేశాము వాటికి మేలు అన్నది చేరదు. మరియు వాటికి హితోపదేశం ప్రయోజనం కలిగించదు. వారు మాటలను వాటి పదములను మార్చి మరియు వాటి అర్ధాలను తమ మనోవాంఛలకు అనుగుణంగా మార్చి వేసి వాటి స్థానముల నుండి తారుమారు చేసేవారు. మరియు వారు తమకు బోధించబడిన వాటిలో నుండి కొన్నింటిని ఆచరించటం వదిలివేశారు. ఓ ప్రవక్తా అల్లాహ్ విషయంలో మరియు ఆయన విశ్వాసపర దాసుల విషయంలో వారి అవినీతి మీకు అనునిత్యం బట్బయలు అవుతునే ఉంది. కాని వారిలో నుండి కొంత మంది తమతో తీసుకున్న ప్రమాణమును పూర్తి చేశారు. కావున వారిని మీరు మన్నించండి మరియు వారిని శిక్షించకండి. వారిని క్షమించి వేయండి. నిశ్ఛయంగా ఇది ఉపకారము. మరియు అల్లాహ్ ఉపకారము చేసేవారిని ఇష్టపడుతాడు.